Saturday, November 23, 2024
HomeTrending Newsఇవి ఎన్నికలా?: చంద్రబాబు ఎద్దేవా

ఇవి ఎన్నికలా?: చంద్రబాబు ఎద్దేవా

తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మాదిగ వర్గీకరణకు టిడిపి ఎప్పుడూ అనుకూలమేనని, తమ హయాంలోనే వర్గీకరణ చేశామని… ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. కాలి తుంటికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న మంద కృష్ణ మాదిగను అయన నివాసంలో చంద్రబాబు పరామర్శించారు. మంద కృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. తాము ఎన్నికలు బహిష్కరించిన తరువాత వాటిని ఎన్నికలని ఎలా అంటారని ప్రశించారు. ఏకపక్షంగా జరిగిన ఈ ఎన్నికలకు ఏమాత్రం  పవిత్రత లేదని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు…

⦿ ఏపీలో ఏక పక్షంగా జరిగిన ఎన్నికలు స్థానిక ఎన్నికలు, మేము ఆ ఎన్నికలని బహిష్కరించం
⦿ దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు
⦿ ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి
⦿ ఏపీలో ఒకసారి ఓటడిగారు, వేశారు రెండోసారి ఓటు వేయకూడదని ప్రజలు అనుకుంటున్నారు.
⦿ జగన్ కు నేరాలు-ఘోరాలు చేయడం అలవాటు
⦿ నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు నేరాలు చేయలేదు
⦿ నేను రౌడీయిజం చేయాలనుకుంటే జగన్ బయటకు వచ్చేవాడు కాదు
⦿ ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు
⦿ ప్రస్తుతం మా పార్టీ కార్యకర్తలపై జగన్ పెట్టేవన్నీ తాత్కాలిక ఇబ్బందులే
⦿ ఇప్పుడు కూడా వైసిపి వాళ్ళు ఏమి చేయలేరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు..
⦿ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి
⦿ నాలాంటి వాడు మీటింగ్ పెట్టుకునే పరిస్థితి కూడా తెలంగాణలో లేదు
⦿ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నా మీదనే తప్పుడు కేసులు బనాయించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్