Saturday, November 23, 2024
HomeTrending Newsవాణిజ్య ఉత్సవం ప్రారంభం

వాణిజ్య ఉత్సవం ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వాణిజ్య ఉత్సవం-2021ను ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడ ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్లో  రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెద్ద ఎత్తున ఆకర్షించడం, ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.  ఎక్స్ పోర్ట్స్ కార్నివాల్ లో పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు.  రాష్ట్రంలో ఎక్కువగా ఎగుమతి అయ్యే వస్తువులను ప్రదర్శనలో  తిలకిస్తూ వివరాలను సిఎం జగన్  ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

ముఖ్యమంత్రి  చేతుల మీదుగా జరిగిన జ్యోతి ప్రజ్వలనతో ఈ సదస్సు లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ రావు, హిందూపురం ఎంపీ, విజయవాడ మేయర్,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరవింద్ గోయెంక, కియా సంస్థ ప్రతినిధి డోంగ్ లి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దార్శనికత, ప్రజలకు మంచి చేయాలనే తపనను సెయింట్ వ్యవస్థాపకులు పద్మశ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్