కోవిషీల్ద్ టికా రెండు డోసుల మధ్య సమయాన్ని పెంచుతూ జాతీయ టికా సాంకేతిక సలహా మండలి నిర్ణయం తీసుకుంది. కోవిషీల్ద్ మొదటి డోసు తీసుకున్న తరువాత 6 నుంచి 8 వారాల మధ్యలో రెండో డోసు తీసుకోవాలని గతంలో సలహా మండలి సూచించింది. అయితే మరిన్ని పరిశోధనల తరువాత ఈ సమయాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచింది. దీన్నిబట్టి కోవిషీల్ద్ మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకునేందుకు మూడు నెలల వరకూ సమయం వుంటుంది.
కోవాక్సిన్ డోసుల విషయంలో ఎలాంటిమార్పు లేదు. తోలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల మధ్యలో రెండో డోసు కూడా తీసుకోవాలి. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయి కోలుకున్న వారు ఆరు నెలల తర్వాతే వాక్సిన్ తీసుకోవాలని సలహా మండలి సూచించింది.
మరోవైపు 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసు వున్న వారిపై కోవాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు భారత ఔషధ నియంత్రణ మండలి భారత్ బయోటెక్ సంస్థకు అనుమతించింది. 525 మందిపై ట్రయల్స్ నిర్వహించనుంది భారత్ బయోటెక్ సంస్థ