దేశంలో ఆక్సిజన్ దొరకడం సవాల్ గా మారిందని రాష్ట్ర పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటియార్ వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ సరఫరా మొత్తం కేంద్రం తన చేతుల్లోకి తీసుకుందన్నారు. ట్విట్టర్ లో ‘ఆస్క్ మి’ కార్యక్రమాన్ని కేటిఆర్ నిర్వహించి కోవిడ్, ప్రస్తుత పరిస్థితులపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమిడిసివర్ వాడకంపై ఆడిట్ చేస్తున్నామని, కొన్ని ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా ఈ మందును వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. రెమిడిసివర్ విషయంలో డాక్టర్లు పేషంట్లకు అన్యాయం చేయవద్దని సూచించారు.
జూనియర్ డాక్టర్లకు జీతాల పెంపు, కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చే విషయాన్ని ముఖమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేటిఆర్ హామీ ఇచ్చారు. వాక్సినేషన్ లో తెలంగాణా రాష్ట్రం ముందంజలో ఉందని, జాతీయ సగటు కంటే తెలంగాణా లోనే ఎక్కువ వాక్సినేషన్ జరుతుతోందని వివరించారు. ఇప్పటివరకు తొలి డోస్ 45.37 లక్షల మందికి ఇచ్చామని, రెండవ డోస్ 10.2 లక్షల మందికి ఇచ్చామని తెలిపారు.
వాక్సిన్ సరఫరా కూడా కేంద్రం చేతుల్లోనే వుందని, వాక్సిన్ ఉత్పత్తి ఇప్పుడు పెను సవాల్ గా మారిందన్నారు. లాక్ డౌన్ సడలింపు 4 గంటలు మాత్రమే కొనసాగుతుందని కేటిఆర్ స్పష్టం చేశారు.