Monday, November 25, 2024
HomeTrending Newsప్రధాని కనబడుటలేదు : రాహుల్ ఎద్దేవా

ప్రధాని కనబడుటలేదు : రాహుల్ ఎద్దేవా

కోవిడ్ పరిస్థితుల్లో పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణం, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరతపై రోజుకో ట్వీట్‌తో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు మరో అడుగు ముందుకేసి ప్రధాని పై తీవ్రంగా విమర్శలు  చేశారు.

దేశంలో వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కన్పించట్లేదని  రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కరోనా ఉద్ధృతిపై ప్రధాని కనీసం స్పందించడం లేదంటూ పరోక్షంగా దుయ్యబట్టారు. ‘‘వ్యాక్సిన్‌,  ఆక్సిజన్‌,  ఔషధాలతో పాటు ప్రధానమంత్రి కూడా కన్పించట్లేదు…. కేవలం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు, మందులపై జీఎస్టీ, అక్కడా.. ఇక్కడా ప్రధాని ఫొటోలు మాత్రమే కన్పిస్తున్నాయి’’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు.

దేశంలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉచితంగా చేపట్టాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీల నేతలు నిన్న ప్రధానికి లేఖ రాశారు.  సెంట్రల్‌ విస్టా నిర్మాణాన్ని తక్షణమే ఆపి.. ఆ మొత్తాన్ని ఆక్సిజన్‌ సేకరణ, ఇతర కొవిడ్‌ నియంత్రణ చర్యలకు ఉపయోగించాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్