Sunday, May 19, 2024
Homeతెలంగాణకరోనా విరాళాల దోపిడీ : రేవంత్ రెడ్డి ఆరోపణ

కరోనా విరాళాల దోపిడీ : రేవంత్ రెడ్డి ఆరోపణ

కరోనా సహాయ చర్యల కోసం వివిధ వర్గాలు ఇచ్చిన విరాళాల్లో దోపిడీ జరిగిందని కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యుడు ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. . వైద్య పరికరాలు, కరోనా కిట్ల కొనుగోలులో సైతం భారీ అవినీతి జరిగిందని, ఇది ఈఏస్ఐ కుంభకోణం కంటే పెద్దదని చెప్పారు. కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు గా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ఇస్తే దాన్ని తొక్కి పెట్టారని విమర్శించారు.

కరోనా ముప్పును ముందే గుర్తించి సీసీఏంబీ, డీఆర్ డివోలాంటి సంస్థలను భాగస్వామ్యం చేసి ఓక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరినా పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ ప్రభుత్వం కూడా సోనియా గాంధీ ఇచ్చిన సలహాలను పెడచెవిన పెట్టిందన్నారు.

భారత్ బయోటెక్ , సిరమ్ ఇనిస్టిట్యూట్ లు కరోనా వ్యాక్సిన్ పేటెంట్ హక్కులు తమ దగ్గర ఉంచుకోవడం వల్లే వ్యాక్సినేషన్ వేగంగా జరగట్లేదని … ఈ రెండు సంస్థల సామర్థ్యం తో వ్యాక్సిన్ వేస్తే…2023 వరకు కూడా ప్రక్రియ పూర్తి కాదని పేర్కొన్నారు. కరోనా కేసులు తగ్గించి చెప్పడం వల్ల రాష్ట్రానికి రావాలసిన వ్యాక్సిన్ లు కేంద్రం ఇవ్వడం లేదన్నారు.

కరోనా మందు ల మీద కేంద్రం జీఏస్టీ వసూలు చేయడం దారుణమన్నారు రేవంత్. వైద్యం లో వినియోగించే ప్రతీ వస్తువు పైన జీఏస్టీ ని రధ్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్, జయేశ్ రంజన్ అవిభక్త కవలలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ లో ఓక్క నిపుణుడు కూడా లేడని, టెండర్లు పిలిచే అవకాశం ఉంది కాబట్టే …కేటీఆర్ టాస్క్ ఫోర్స్ కమిటీ లో ఉన్నారని దుయ్యబట్టారు. కేటిఆర్ కోసమే ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించారన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చినట్లు ఇక్కడ కూడా అడ్డామీది కూలీలకు ప్రతినెలా 5 వేల ఆర్థిక సహాయంతో పాటు 25కేజీల బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్పోరేట్ ఆసుపత్రులను ప్రభుత్వం నియంత్రణ చేయాలని 50 శాతం పడకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధినంలోకి తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో ఉన్న 23 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ కార్పోరేట్ ఆసుపత్రుల చేతిలో కీలు బొమ్మలా మారారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్