సిఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లింలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా నుంచి బయటపడి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసమని తెలిపారు. ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లింలందరూ నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ, అల్లాను ఆరాధిస్తూ జీవనం సాగిస్తారని పేర్కొన్నారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉన్నదాంట్లో దాన ధర్మాలు చేస్తూ సేవా, సహనానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారని జగన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *