పవన్ కళ్యాణ్ ఆరాటం ప్రజలకోసం కాదని, ప్యాకేజీ కోసమేనని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ది ప్రశ్నించే పార్టీ కాదని, ప్యాకేజీ తీసుకునే పార్టీ అని అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే జాతీయ రహదారులపై మాట్లాడకుండా రాష్ట్రం పరిధిలో ఉండే రోడ్లపైనే అయన మాట్లాడుతున్నారని విమర్శించారు.
కరోనాతో గత ఏడాదిన్నరగా ప్రపంచం యావత్తూ అల్లడుతోందని, రాష్ట్రంలో కూడా కరోనా ఇటీవలే తగ్గుముఖం పట్టిందని, ఈలోగా వర్షాకాలం మొదలైందని అయన వివరించారు. వర్షాలు తగ్గగానే రోడ్ల మమ్మతులు చేపట్టాలని ఇప్పటికే సిఎం జగన్ నిధులు కూడా కేటాయించారని, టెండర్లు కూడా పిలిచామని అయన గుర్తు చేశారు. ఈలోగా ఈ అంశాన్ని రాద్ధాంతం చేయడం తగదని అయన హితవు పలికారు.
పవన్ కళ్యాణ్ కేవలం తన ఉనికి కోసమే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, బూటకపు శ్రమదానాలు చేస్తున్నారని విమర్శించారు.