Monday, January 20, 2025
HomeTrending Newsముస్లీంల అభ్యున్నతి కోరుకున్న సిఎంలు ఇద్దరే

ముస్లీంల అభ్యున్నతి కోరుకున్న సిఎంలు ఇద్దరే

ఏళ్లతరబడి నేను ముస్లీంలు, మైనారిటీల అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నానని, అసెంబ్లీ వేదికగా మైనారిటీల సమస్యలు ప్రస్తావిస్తున్నానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని మజ్లీస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. మైనారిటీల కష్టాలు తీరటం లేదని అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదని, ఉన్నన్ని రోజులు మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటానని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.

హైదరాబాద్ కి మెట్రోరైలు వచ్చింది- పాతబస్తీ కి రాలేదని, హైదరాబాద్ పాతబస్తీ కి మెట్రో కావాలంటే ఢిల్లీ అనుమతి కావాలని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. అందరం కలిసి ఢిల్లీ వెళ్లి అనుమతి అడుగుదామని, పాతబస్తీ కి బస్సులు కూడా పూర్తిగా రావడం లేదన్నారు. హైదరాబాద్ అంతా మెట్రో నడుస్తది కానీ పాతబస్తీ అనగానే పర్యావరణ అనుమతి అడ్డు వస్తుందా అని ఓవైసీ ప్రశ్నించారు.

తెలంగాణలో ముస్లిం వర్గాలకు స్నేహపూర్వకమైన ముఖ్యమంత్రులు ఇద్దరే ఉన్నారని, ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కాగా మరొకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఈ ఇద్దరు సిఎం లు మినహా మరెవరు నిబద్దతగా మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేయలేదని ఒవైసీ తెలిపారు. కెసిఆర్, YS రాజశేఖర్ రెడ్డి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ముస్లీం సమాజంలో గుర్తుండి పోయే నేతలని అక్బరుద్దీన్ ఓవైసీ ఉద్వేగంగా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్