Saturday, November 23, 2024
HomeTrending Newsజనవరి 26కి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ :సిఎం

జనవరి 26కి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ :సిఎం

ఫ్యామిలీ డాక్టర్‌  కాన్సెప్టును జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌ హబ్స్‌, హెల్త్ కార్డ్స్, ఆరోగ్యశ్రీపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీహెచ్‌సీల్లో నాడు– నేడు పనులు, కొత్త పీహెచ్‌సీల నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ సూచనలు:

⦿ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి
⦿ మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
⦿ పీహెచ్‌సీ నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి
⦿ ఆరోగ్య శ్రీ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలి
⦿ ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ మీద ప్రచారం నిర్వహించాలి
⦿ ఆరోగ్య మిత్రల ఫోన్‌ నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్‌ లో ఉంచాలి}
⦿ ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించే ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలి
⦿108 వెహికల్స్‌ సిబ్బందికి, సామాన్య ప్రజలకు డిజిటల్‌ పద్ధతుల్లో ఈ వివరాలు అందుబాటులో ఉండాలి
⦿ హెల్త్‌ కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలి
⦿ పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందుల వివరాల డేటా ఉండాలి
⦿ దీనివల్ల వైద్యంకోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది
⦿ బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలి
⦿ 104 ద్వారా నిర్వహించే టెస్టుల నివేదికల డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌ కార్డుల్లో పొందుపర్చాలి
⦿ డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ ఐడీలు క్రియేట్‌చేస్తున్నామన్న అధికారులుఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వైద్య

ఆరోగ్యశాఖ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్,  కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి యస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వినయ్‌ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్,  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్