Sunday, February 23, 2025
HomeTrending Newsఆర్బీకేలపై దుష్ప్రచారం తగదు: సిఎం జగన్

ఆర్బీకేలపై దుష్ప్రచారం తగదు: సిఎం జగన్

రైతు భరోసా కేంద్రాలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్,  ఫీడ్,  ఎరువులు రైతులకు అందుబాటులోకి రావడం వారికి ఇష్టం లేనట్లుందని మండిపడ్డారు.  రైతులు అప్పుల కోరల్లో చిక్కుకోవాలని, ఎరువులు, విత్తనాల కోసం అప్పులు చేసి వడ్డీలు మీద వడ్డీలు చెల్లించే పరిస్థితులే కొనసాగాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోందని విమర్శించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రైతులకు మంచి ధర అందేలా  అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని, ధరల స్థిరీకరణనిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలని నిర్దేశించారు.

ఈ సందర్భంగా సిఎం జగన్ చేసిన సూచనలు

⦿ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలి
⦿ దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుంది
⦿ ధరల విషయంలో రైతులకు ఎక్కడ నిరాశాజనక పరిస్థితులు ఉన్నా వెంటనే జోక్యం చేసుకోవాలి
⦿ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలి
⦿ ఆర్బీకేల పనితీరును దేశవ్యాప్తంగా కొనియాడుతున్నారు
⦿ నాణ్యత ఉన్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు రైతులకు మంచి ధరలకే లభిస్తున్నాయి
⦿ బైట మార్కెట్లో డీలర్‌ అమ్మే రేట్ల కన్నా తక్కువ రేట్లకే లభిస్తున్నాయి, రేట్లలో మోసం లేదు, క్వాలిటీలో మోసం లేదు
⦿ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా, రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాం
⦿ ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్లను ప్లేస్‌చేయగానే వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలి
⦿ వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి

దీనితో పాటు బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలు,  జగనన్న పాలవెల్లువ. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం పైనా సీఎం సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ మార్కెటింగ్‌ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్