Saturday, November 23, 2024
Homeసినిమారాజ్ తరుణ్ , సందీప్ మాధవ్  ‘మాస్ మహారాజు’ ప్రారంభం

రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్  ‘మాస్ మహారాజు’ ప్రారంభం

స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ , సిమ్రత్, సంపద హీరో హీరోయిన్లుగా సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వంలో ఎం.అసిఫ్ జానీ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మాస్ మహారాజు’. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరిగాయి. నిర్మాత సి.కళ్యాణ్, జెమిని కిరణ్, దర్శకుడు వీరశంకర్, నిర్మాత బెక్కం వేణుగోపాల్, నాంది డైరెక్టర్ సతీష్ కనక మేడల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సి.హెచ్.సుధీర్ రాజు మాట్లాడుతూ  “మనకు సూర్యచంద్రులు ఒకరి కోసం ఒకరు ఎలా వస్తూ వెళ్తున్నారో ఈ సినిమాలో వీరిద్దరూ ఒకరి కోసం, ఒకరు ఏం త్యాగం చేశారన్నదే కథ. ఫ్రెండ్షిప్ కోసం తీస్తున్న ఈ సినిమాను ఫ్రెండ్స్ ఎవరు చూసినా మా ఇద్దరి జీవితాల్లో ఇటువంటి కథ జరిగిందని అనుకునేలా సినిమా ఉంటుంది. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ  సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా” అని అన్నారు.

అసిఫ్ జానీ మాట్లాడుతూ “మొట్టమొదటిగా నేను తీస్తున్న ఈ సినిమాకు అందరూ వచ్చి బ్లెస్స్ చేసినందుకు మా ధన్యవాదాలు. నేను సినిమా మొదలు పెట్టినప్పుడు నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు.  రాజా రవీంద్ర గారు కలసి మాకు సపోర్ట్ చేస్తూ ధైర్యం చెప్పడంతో ఈ రోజు సినిమా గ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది. మేము తీస్తున్న ఈ సినిమా అందరినీ తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది” అన్నారు.

“వంగవీటి, జార్జిరెడ్డి తర్వాత మంచి పవర్ ఫుల్ కథ చెప్పిన డైరెక్టర్ సుధీర్ వర్మ గారికి నా ధన్యవాదాలు. ఈ సినిమా కథ చాలా అద్భుతంగా ఉంది. అజయ్ విన్సెంట్ కెమెరామెన్ గా, మణి శర్మ గారు సంగీత దర్శకుడుగా ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. అందరు ప్రేక్షకులను ఈ సినిమా ఆలరిస్తుంది. మంచి టైమింగ్ తో ఒక యాక్షన్ ప్యాక్డ్ ఫ్రెండ్షిప్ లో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని సందీప్ మాధవ్ అన్నారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “దర్శకుడు సుధీర్ ఈ కథ చెప్పగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నిర్మాత ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్ గా తీస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత కలిసినప్పుడు ఇందులో సందీప్ కూడా నటిస్తున్నాడు అని చెప్పగానే సినిమా చాలా బాగుంటుందని సినిమాపై నమ్మకం వచ్చింది. సినిమాను త్వరలో షూటింగ్ మొదలు పెట్టి రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి త్వరగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్