Oxygen shortage at Tirupathi SVIMS :
తిరుపతి స్విమ్స్ కు సరఫరా అయ్యే ఆక్సిజన్ కోటాలో కోత పడనుంది. 15 ఏళ్ళుగా తమిళనాడుకు చెందిన ఎయిర్ వాటర్ కంపెనీ స్విమ్స్ కు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ప్రతిరోజూ రెండు సార్లు 14 వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ను సరఫరా చేస్తూ వస్తోంది. తమిళనాడు సర్కార్ ఆదేశాలతో ఇకపై తాము రోజుకు 8 వేల లీటర్లకు మించి పంపలేమని కంపెనీ స్పష్టం చేసింది.
స్విమ్స్ లో ప్రస్తుతం 467 మంది రోగులు కోవిడ్ చికిత్స పొందుతున్నారు, స్విమ్స్ లో 90 శాతం బెడ్లకు ఆక్సిజన్ అవసరం వుంది. ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీ నిర్ణయంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే పనిలో అధికారులు వున్నారు.
Also Read : మూడో దశపై అప్రమత్తం : సిఎం సూచన