Sunday, February 23, 2025
Homeతెలంగాణతెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ప్రమాదకరంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,446 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 12 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 1,414 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 33,514కి చేరింది. వీరిలో 22,118 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 598 కేసులు నమోదయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్