గుజరాత్ నుంచి 80 టన్నుల ఆక్సిజన్ తో బయల్దేరిన రైలు గుంటూరు స్టేషన్ కు చేరుకుంది. సీనియర్ ఐఏయస్ అధికారి కృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ కృష్ణ బాబు గుంటూరు స్టేషన్ వద్ద ఈ రైల్ ను పరిశీలించారు. దీన్ని గుంటూరుతో పాటు ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా లకు ట్యాంకర్ల ద్వారా తరలిస్తారు.
ఆక్సిజన్ సరఫరా కోసం ప్రభుత్వం ఒక కమిటిని నియమించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వృధా అరికట్టి ఒక పధ్ధతి ప్రకారం దీన్ని వినియోగించాలని భావిస్తోంది.
గుజరాత్ నుంచి ప్రతిరోజూ ఆక్సిజన్ సరఫరా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడికి లేఖ రాశారు.