Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్పిఎన్జీపై ఘనవిజయం : సూపర్ 12కి బంగ్లాదేశ్

పిఎన్జీపై ఘనవిజయం : సూపర్ 12కి బంగ్లాదేశ్

ఐసిసి టి-20 పురుషుల వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ సూపర్ 12 కి చేరుకుంది. నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో  పిఎన్జీపై బంగ్లాదేశ్ 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ ఆల్ రౌండ్ ప్రతిభతో (46 పరుగులు, 4 వికెట్లు) రాణించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు.

ఒమన్ లోని అల్ అమరత్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా ఓపెనర్ మహమ్మద్ నయీం డకౌట్ అయ్యాడు. రెండో వికెట్ కు మరో ఓపెనర్ లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్ యాభై పరుగులు జోడించారు. లిటన్ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. కాసేపటికే ముస్తాఫిర్ రహీం(5) ఔటయ్యాడు. షకీబ్ 37 బంతుల్లో 3 సిక్సర్లతో 46; కెప్టెన్ మహ్ముదుల్లా 28 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్సర్లతో 50; అఫిఫ్ హుస్సేన్ 14 బంతుల్లో  3 ఫోర్లతో  21;  చివర్లో బౌలర్ మహమ్మద్ సైఫుద్దీన్ కేవలం 6 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో19 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లాదేశ్ నిర్ణీత 20  ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పీఎన్జీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వికెట్ కీపర్ కిప్లిన్ దొరిగా 34 బంతుల్లో 2 ఫోర్లు,  2 సిక్సర్లతో 46 పరుగులతో అజేయంగా నిలిచి అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. చాద్ సోపెర్ 11 పరుగులు చేశాడు, వీరిద్దరే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీనితో 19.3 ఓవర్లలో 97 పరుగులకే పిఎన్జీ ఆలౌట్ అయ్యింది. గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే శ్రీలంక సూపర్ 12 కు చేరుకోగా, నేటి విజయంతో బంగ్లాదేశ్ గ్రూప్ బి నుంచి సూపర్ 12 లో చోటు సంపాదించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్