Friday, November 22, 2024
Homeజాతీయంసిబిఐ ఆఫీసుకు మమత

సిబిఐ ఆఫీసుకు మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోల్ కతా లోని సిబిఐ కార్యాలయంలో హల్ చల్ చేశారు. . నారద కేసులో తమ పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేయడంపై ఆమె భగ్గుమన్నారు. సిబిఐ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీశారు.

నారదా కేసులో తన దర్యాప్తును సిబిఐ వేగవంతం చేసింది. ఇద్దరు మంత్రులతో సహా నలుగురు తృణమూల్ కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంది. మమత మంత్రి వర్గంలో పని చేస్తున్న సుబ్రత ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, ఎమ్మెల్యే చందన్ మిత్ర, మాజీ ఎమ్మెల్యే, కోల్ కతా మాజీ మేయర్ సావన్ ఛటర్జీలను అదుపులోకి తీసుకుంది.

మంత్రుల అరెస్టుపై తనకు ఎలాంటి సమాచారం లేదని బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ వెల్లడించారు. మంత్రుల అరెస్ట్ అక్రమమని, తన అనుమతి లేకుండానే వారిని అదుపులోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

ఇటివలే మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మంత్రుల విచారణకు బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన కర్ గత వారమే సిబిఐ కి అనుమతి మంజూరు చేశారు. గతంలో కూడా ఈ కేసులో సంబంధం ఉందంటూ పలువురు తృణమూల్ నేతలను సిబిఐ అదుపులోకి తీసుకుంది. వారిలో కొందరు ఎన్నికల సమయంలో బిజెపిలో చేరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్