నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజును వైద్య పరీక్షలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రేం కోర్టు తీర్పు చెప్పింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని తెలంగాణా హైకోర్టును ఆదేశించింది. మొత్తం పరీక్షలను వీడియో చేయించాలని కోర్టుకు సమర్పించాలని సూచించింది.
వైద్య పరీక్షల సమయాన్ని కూడా జ్యుడిషియల్ కష్టడిగా పరిగణించాలని నిర్దేశించింది. ఏపి చీఫ్ సెక్రటరీ, తెలంగాణా హైకోర్టు రిజిస్ట్రార్ కు ఈ మొత్తం బాధ్యతలు అప్పగించిన సర్వోన్నత న్యాయస్థానం వైద్య నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని స్పష్టం చేసింది. వై కేటగిరి భద్రత కొనసాగించాలని చెప్పింది.
బెయిల్ పిటిషన్ ను శుక్రవారానికి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని సూచించింది.
ఈ కేసులో ఏపి ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, రఘురామ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రఘురామకు బెయిల్ ఇవ్వాలని, ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యానికి అనుమతివ్వాలని ముకుల్ వాదించారు. ప్రైవేటు ఆస్పత్రిలో కూడా వైద్య పరిక్షలు వసూలు చేయాలని కింది కోర్టు సూచించినా అది అమలు చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆయనపై ఎవరూ ఫిర్యాదు ఫిర్యాదు చేయలేదని, కస్టడిలో తన పిటిషనర్ ను తీవ్రంగా కొట్టారని వాదిస్తూ సంబంధించిన ఫోటోలను చూపించారు. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న వాదనలపై దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళగిరి ఆస్పత్రిలో అయితే తమకు అభ్యంతరం లేదని వివరించారు.