NGT Stay On Palamuru Rangareddy Project :
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై స్టే విధిస్తూ చెన్నై లోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు కొనసాగించవద్దని స్పష్టం చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకొని ఆ తర్వాతే పనులు పునః ప్రారంభించాలని సూచించింది.
ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు న్రిమిస్తున్నారని చంద్ర మౌలీశ్వర్ రెడ్డి అనే వ్యక్తిఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపింది, తాగునీటి కోసం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పిన తెలంగాణా ప్రభుత్వం సాగునీటి కోసం కూడా నీటిని వినియోగించుకునేలా నిర్మాణం చేపట్టిందని పిటిషనర్ వాదించారు.
Must read :‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన దర్శకేంద్రుడు