Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్స్కాట్లాండ్ పై న్యూజిలాండ్ గెలుపు

స్కాట్లాండ్ పై న్యూజిలాండ్ గెలుపు

టి-20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ 16 పరుగుల తేడాతో స్కాట్లాండ్ పై విజయం సాధించింది. స్కాట్లాండ్ స్ఫూర్తిదాయకమైన ఆటతీరు ప్రదర్శించి చివరివరకూ పోరాడి ఓడిపోయింది. న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ మరోసారి టి20లో తన సత్తా చాటాడు. కేవలం 56  బంతుల్లో 6ఫోర్లు, 7సిక్సర్లతో 93 పరుగులు చేసి సెంచరీ ముంగిట 19వ ఓవర్లో ఔటయ్యాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ 35 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు…ఓపెనర్  దేరిల్ మిచెల్ (13), కెప్టెన్ విలియమ్సన్(0) అవుట్ కాగా,చ 52 వద్ద మూడో వికెట్ (డెవాన్ కాన్వే-1) కోల్పోయింది. ఈ దశలో గ్లెన్ ఫిలిప్స్, గుప్తిల్ లు నాలుగో వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫిలిప్స్ 37 బంతుల్లో ఒక సిక్సర్ తో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి న్యూ జిలాండ్ 172 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. స్కోరు 21 వద్ద కెప్టెన్, ఓపెనర్ కోయిట్జెర్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జార్జ్  మున్సీ-22; మాథ్యూ క్రాస్-27; రిచీ బెర్మింగ్టన్-20; మాక్ లియోడ్-12పరుగులు చేశారు. చివర్లో మైఖేల్ లీస్క్ కేవలం 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో  42 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్కాట్లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బోల్డ్, ఇష్ సోధి చెరో రెండు, టిమ్ సౌతీ ఒక వికెట్ పడగొట్టారు.

న్యూ జిలాండ్ ఓపెనర్ గుప్తిల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్