Afghan Embassy Opened In Pakistan :
ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ఏలుబడిలోకి వచ్చాక మొదటి రాయబార కార్యాలయాన్ని పాకిస్తాన్లో ప్రారంభించింది. శుక్రవారం నుంచి రాయబార కార్యాలయం ఆఫ్ఘన్ ప్రజలు, శరణార్థులు, విదేశీయులకు సేవలు అందిస్తుందని ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జాబిఉల్లః ముజాహిద్ ప్రకటించారు. కొన్ని నెలలుగా విదేశాలకు వెళ్లేవారికి, ఆఫ్ఘన్ వచ్చే వారికి ఇబ్బందులు వస్తున్నాయని, ఇక నుంచి ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాలను సంప్రదించవచ్చని ముజాహిద్ వెల్లడించారు. ఇస్లామాబాద్ ఎంబసీతో పాటు కరాచీ, పెషావర్, క్వెట్టా నగరాలలోని ఆఫ్ఘన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తాయన్నారు.
ప్రస్తుతం పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘన్ కు వ్యాపార, వాణిజ్య పనుల కోసం వచ్చేవారికి ఉపయుక్తంగా ఉంటాయని తాలిబన్లు ప్రకటించారు. త్వరలోనే మరిన్ని దేశాల్లో రాయబార కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయని ముజాహిద్ చెప్పారు. రష్యా, చైనా లో తొందరలోనే ఆఫ్ఘన్ ఎంబసీలు సేవలు అందిస్తాయని వాటితో పాటు అమెరికా, యూరోప్, ఇండియా తదితర దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని ముజాహిద్ పేర్కొన్నారు.
Must Read :ఆఫ్ఘన్ పై ఇండియా విజయం