Friday, November 22, 2024
HomeTrending Newsఇది ఓ పరీక్షా సమయం : మోడీ

ఇది ఓ పరీక్షా సమయం : మోడీ

కరోనా వైరస్ సమాజానికి ఓ సవాల్ విసిరిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే అధికారులు తమ శక్తి సామర్ధ్యాలు నిరుపించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయ పడ్డారు. ఈ వైరస్ ను సమర్ధంగా ఎదుర్కొంటూనే కొత్త వ్యుహాలు, పరిష్కారాలు ఆలోచించాలని సూచించారు.

10 రాష్ట్రాలకు చెందిన 54 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. ఛత్తీస్ గడ్, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, పుదుచ్చేరి, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులతో కోవిడ్ పరిస్థితిపై చర్చించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అధికారుల పనితనానికి కరోనా సవాళ్లు విసురుతోందని, ఇది ఒక పరీక్షా కాలమని మోడీ అన్నారు.

క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నపుడు ఎదురయ్యే సవాళ్లు, అనుభవాలు, సమాచారంతో సరికొత్త విధానాలు రుపొందించాల్సి ఉంటుందని మోడీ అన్నారు. వాక్సిన్ వృధా పై అధికారులు దృష్టి పెట్టాలని, ఒక్క డోసు వృధా అయినా ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన డోసును మనం వృధా చేసినట్లు గుర్తించాలని హితవు పలికారు. వాక్సిన్ పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు తెలియజేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను కూడా పరిగణన లోకి తీసుకుంటున్నామని వివరించారు.

మొన్న మే 18న 10 రాష్ట్రాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోడీ రెండో విడతలో భాగంగా ఈరోజు మరో 10 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్