Friday, November 22, 2024
Homeజాతీయంబ్లాక్ ఫంగస్ అంటువ్యాధి : కేంద్రం

బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి : కేంద్రం

బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తే వెంటనే కేంద్రానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

ప్రపంచంలో మన దేశంలోనే బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు గుర్తించారు. తొలిదశలోనే అప్రమత్తంగా వ్యవహరించి కట్టడి చేయాలని కేంద్రం భావిస్తోంది. అందుకే 1897 ఎపిడమిక్ డిసీజస్ యాక్ట్ కింద అంటువ్యాధిగా గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బ్లాకు ఫంగస్ ట్రీట్మెంట్ కోసం ఢిల్లీలో ¬3 కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది.

అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శాలలు, మెడికల్ కాలేజిలు… వ్యాధి గుర్తింపు, పరిక్షలు, చికిత్సలో కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు పాటించాలని పేర్కొంది.
కరోనా చికిత్స పొంది కోలుకున్న వారిలో బ్లాకు ఫంగస్ లక్షణాలు ఎక్కువగా బైటపడుతున్నాయని, కరోనాకు వైద్యంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకోవడం, డయాబెటిక్ సమస్యల వల్ల ఫంగస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కంటి చూపు మందగించడం, ముక్కు బిగేయడం, ముక్కు నుంచి నల్ల రంగులో ద్రావం కారడం, ఛాతీలో నొప్పి, శ్వాశ సమస్యలు ఈ వ్యాధి లక్షణాలని వివరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్