Wednesday, November 27, 2024
HomeTrending Newsసమస్యలు పరిష్కరించండి : సిఎం విజ్ఞప్తి

సమస్యలు పరిష్కరించండి : సిఎం విజ్ఞప్తి

రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్ణీత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో జగన్‌ మాట్లాడారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని,  ఏడేళ్లు గడిచినా విభజన హామీలు అమలు కావడంలేదని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో రాష్ట్రానికి మరింత నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీచేయలేదని, ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలను త్వరగా ఇప్పించాలని కేంద్రానికి ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.  తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ కూడా జరగలేదని, గత ప్రభుత్వంలో ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని,  దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రాల్లో రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న ప్రక్రియలో హేతుబద్ధత లోపించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే సరవణలు చేయాలని డిమాండ్ చేశారు.  రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో వైఎస్ జగన్‌ ప్రస్తావించారు.

పోలవరం ప్రాజెక్టు, రెవెన్యూ లోటు రావాల్సిన రూ.22,948.76 కోట్లు, తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6,112 కోట్ల విద్యుత్ బకాయిలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, షెడ్యూల్‌ 9, 10 జాబితాలోని ఆస్తుల పంపిణీ,  నదీ జలాల సమస్యలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి,  రేషన్‌ బియ్యం కేటాయింపులో హేతు బద్ధత అంశాలను కూడా సిఎం జగన్ సమావేషంలో  లేవనెత్తారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల స్థితిగతులను అర్థం చేసుకుని పరిస్థితులు మారేలా తగిన సిఫార్సులు చేయాలని ఈ కౌన్సిల్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న హోం శాఖ మంత్రి అమిత్ షా కు సిఎం విజ్ఞప్తి చేశారు.  జోనల్ సమావేశాన్నితిరుపతిలో ఏర్పాటు చేసినందుకు హోం మంత్రిత్వ శాఖకు జగన్ ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్