Saturday, November 23, 2024
HomeTrending Newsరైతులకు నేడు పంట నష్టం పంపిణీ

రైతులకు నేడు పంట నష్టం పంపిణీ

Ap Cm To Disburse Crop Damage Compensation :

ప్రకృతి విపత్తుల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగానే పంట నష్టపరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది.

2021 సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్‌ సైక్లోన్‌ కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు 22 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం నేడు నవంబర్ 16న క్యాంప్‌ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్నారు.  ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవడానికి చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఈ–క్రాప్‌ ఆధారంగా పారదర్శకంగా సచివాలయాల్లో జాబితా ప్రదర్శించి మరీ వాస్తవ సాగుదార్లకు పంట నష్టపరిహారం పంపిణీ చేస్తోంది.  గత రెండు వారాలుగా పడుతున్న వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్రస్ధాయిలో బృందాల ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

కడప, అనంతపురం జిల్లాల్లో రబీలో విత్తనాలు వేసుకుని, వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న శనగ రైతులకు 80 శాతం రాయితీతో విత్తనాల సరఫరా మొదలు పెట్టింది. ఈ రబీ సీజన్‌ ముగిసేలోగా, ఖరీఫ్‌ మొదలుకాకముందే పంట నష్టపరిహార పంపిణీ కూడా చేస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు పంట నష్టపరిహారం క్రింద 13.96 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం రూ. 1,071 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Also Read :  కేంద్ర పంటల భీమా విధానం మారాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్