ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాలామంది ఆప్తులను కోల్పోవాల్సి వచ్చిందంటూ ఆవేదనకు లోనై కంటతడి పెట్టుకున్నారు. కరోనాతో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ నియోజకవర్గానికి చెందిన వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. విపత్కర పరిస్థితుల్లో వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.
కరోనాపై పోరులో చాలావరకు విజయం సాధించామని, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ప్రధాని అన్నారు. గ్రామాల్లో కోవిడ్ పై పోరాటంలో ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఏం లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
ఇప్పుడు బ్లాక్ ఫంగస్ రూపంలో మరో ముప్పు వాటిల్లిందని, దీన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.