కృష్ణపట్నం ఆయుర్వేద మందు తయారీదారుడు ఆనందయ్యతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. మందు తయారీ, పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు కేంద్ర అయుష్ బృందం సోమవారం కృష్ణపట్నం రానుంది, ఆనందయ్య మందు శాస్త్రీయత పై అధ్యయనం చేస్తుంది. ఈ బృందానికి ఆనందయ్య డెమో ఇవ్వనున్నారు. కాగా, మందు పంపిణి వారం రోజులపాటు నిలిపివేస్తున్నట్లు జిల్లా పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. నిపుణుల అధ్యయనం తరువాతే మందు పంపిణి కి అనుమతిస్తామని తెలిపారు.
అయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నం వచ్చారు. మందు తయారీపై కొన్ని వివరాలు సేకరించారు. ఈ మందుపై ఇప్పడే ఏమి మాట్లాడలేమని నివేదిక వచ్చాకే తుది నిర్ణయం వెలువరిస్తామని అయుష్ డైరెక్టర్ డా. హర్షిణి చెప్పారు.