Sunday, November 3, 2024
Homeజాతీయంవాక్సిన్ కోసం కేజ్రివాల్ నాలుగు సూచనలు

వాక్సిన్ కోసం కేజ్రివాల్ నాలుగు సూచనలు

దేశంలో వాక్సిన్ సరఫరా పెంచడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి నాలుగు సూచనలు చేశారు. జూన్ 15 నాటికి మొత్తం 5.86 కోట్ల వాక్సిన్ డోసులు రాష్ట్రాలకు పంపుతామని కేంద్రం రెండ్రోజుల కిందట వెల్లడించిన సంగతి తెలిసిందే.

వాక్సిన్ అందుబాటులో లేక 18-45 సంవత్సరాల వయసు వారికి వాక్సిన్ నిలిపెశామని, ఢిల్లీకి వీలైనత ఎక్కువ డోసులు అందేలా చూడాలని కేజ్రివాల్ మరోసారి కేంద్రాన్ని కోరారు. కేజ్రివాల్ సూచనలు…

భారత్ బయోటెక్ కోవాక్సిన్ ను దేశంలో వాక్సిన్ తయారుచేసే సామర్ధ్యంఉన్న అన్ని కంపెనీలలో ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలి

అంతర్జాతీయ కంపెనీలతో మాట్లాడి వారి వాక్సిన్ తెప్పించి రాష్ట్రాలకు అందించాలి

కొన్ని దేశాలు తమ జనాభాకంటే ఎక్కువగా వాక్సిన్ లు తమ వద్ద ఉంచుకున్నాయి. ఆయా దేశాలతో మాట్లాడి వాటిని ఇండియాకు తెప్పించాలి

అంతర్జాతీయ వాక్సిన్ తయారీదారులతో మాట్లాడి ఆ వాక్సిన్ మన దేశంలో తయారు చేయించాలి… అంటూ కేజ్రివాల్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్