Saturday, November 23, 2024
HomeTrending Newsప్రయాణికుల సేవలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు

ప్రయాణికుల సేవలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు

World Class Facilities In Rail Passenger Service :

భారతదేశపు మొట్టమొదటి ‘పాడ్’ రిటైరింగ్ రూమ్‌లను ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసారు. ప్రయాణికులకు సరసమైన ధరలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో విశ్రాంత గదుల సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారతీయ రైల్వే వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.


ప్రతి పాడ్ వినియోగదారుకు కామన్ ఏరియాలో ఉచిత Wi-Fi, సామాను గది, టాయిలెట్‌లు, షవర్ రూమ్‌లు, వాష్‌రూమ్‌లు అందుబాటులో ఉంటాయి. పాడ్ లోపల, అతిథి టీవీ, చిన్న లాకర్, అద్దం, సర్దుబాటు చేయగల ఎయిర్ కండీషనర్, ఎయిర్ ఫిల్టర్ వెంట్లు, ఇంటీరియర్ లైట్ కాకుండా రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్, స్మోక్ డిటెక్టర్లు మరియు DND ఇండికేటర్స్ వంటి సౌకర్యాలను పొందవచ్చు.


పాడ్ హోటల్‌ లేదా క్యాప్సూల్ హోటల్ అని కూడా పిలువబడే వీటిలో అనేక చిన్న గదులు లేదా ఒక్కొక్క బెడ్‌ని కలిగి ఉండే “పాడ్‌లు” ఉంటాయి.ప్రయాణికులు తక్కువ సమయం కోసం వీటిని బుక్ చేసుకోవచ్చు.
ఈ పాడ్ రూమ్‌లు ప్రయాణీకులకు తమ ప్రయాణాన్ని విలాసవంతంగా మార్చడం ద్వారా సౌకర్యాన్ని అందిస్తాయి. త్వరలో దేశంలో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు.

Also Read : ఆఫ్ఘన్ లో హెరాయిన్ సాగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్