Sunday, January 19, 2025
Homeసినిమా26న ‘జీ-5’లో విడుద‌లవుతున్న రిప‌బ్లిక్‌

26న ‘జీ-5’లో విడుద‌లవుతున్న రిప‌బ్లిక్‌

Republic on Zee-5 :
సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా రిపబ్లిక్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో.

సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే… తాను ఏ కోణంలో సదరు సన్నివేశం, సినిమా తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపిస్తే ? అటువంటి ప్రయత్నానికి జీ 5, దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. సినిమా ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్… ముగ్గురితో రిపబ్లిక్ విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు. ఈ నెల 26 నుంచి జీ 5 ఓటీటీ వేదికలో రిపబ్లిక్ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Must Read : యువత చూడాల్సిన సినిమా ‘రిపబ్లిక్’ : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్