Corona Positive For Speaker Pocharam Srinivas Reddy :
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో నాకు పాజిటివ్ నమోదు అయిందని స్పీకర్ వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు వివరించారు. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి కోరారు.
నాలుగు రోజుల క్రితం స్పీకర్ మనవరాలి పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు హాజరయ్యారు. ఈ పెళ్లి కి రెండు రాష్ట్రాల సిఎం లతోపాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన అనేకమంది హాజరయ్యారు.
Also Read : 370 ఆర్టికల్ పునరుద్దరించకపోతే కల్లోలమే