Sunday, January 19, 2025
HomeTrending Newsఅందరికీ ధన్యవాదాలు: భువనేశ్వరి

అందరికీ ధన్యవాదాలు: భువనేశ్వరి

Bhuvaneshwari Statement:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి స్పందించారు. తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లెటర్ హెడ్ పై మీడియాకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

“ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.  నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి/ తోబుట్టువుకు/కూతురుకి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్న గారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాల్లో /ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం  మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను” అని ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read : ఆమె ప్రస్తావనే లేదు: పేర్నినాని

RELATED ARTICLES

Most Popular

న్యూస్