Tuesday, September 17, 2024
HomeTrending Newsధృవీకరణ పత్రాలు అందుకున్న ఎమ్మెల్సీలు

ధృవీకరణ పత్రాలు అందుకున్న ఎమ్మెల్సీలు

MLC Kavitha :

సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించె దిశగా  పోటీ లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్సీ కవిత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ, ఎన్నికలలో సహకరించిన ఉమ్మడి నిజామాబాద్ ‌జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. అంతకు ముందు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి నుండి కల్వకుంట్ల కవిత ధృవీకరణ పత్రం నిజామాబాద్ లో అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్ టి సి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జీవన్ రెడ్డి, షకీల్, గణేష్ బిగాల తదితరులు పాల్గొన్నారు.

అటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా పట్నం మహేందర్ రెడ్డి, శంబీపూర్  రాజు లకు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ధ్రువీకరణ పత్రాలను జిల్లా కలెక్టర్,రిటర్నింగ్ ఆఫీసర్ అమయ్ కుమార్ అందచేశారు.

రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులను  అభినందించిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,  చిత్రంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు.

Also Read : రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం

RELATED ARTICLES

Most Popular

న్యూస్