గ్రామాల్లో కోవిడ్ నియంత్రణ కోసం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు పల్స్ ఆక్సిమీటర్లు, చేతి తొడుగులు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జ్వర బాధితులు గుర్తించే ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల పంపిణి
మచిలీపట్నం సిటీ కేబుల్ తరఫున ఎండి కొల్లు శ్రీనివాసరావు 5 , భీమవరం కమ్యూనికేషన్స్ లిమిటెడ్ రాజు మరో 5 ఆక్సిజన్ కాన్సెంట్రటర్లు మానవత్వంతో అందచేయడం అభినందనీయమని మంత్రి పేర్ని ప్రశంసించారు. తాను ఇచ్చిన పిలుపు మేరకు ముందుకొచ్చి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒకొక్క ఆక్సిజన్ కాన్సెంట్రటర్ 1 లక్షా 40 వేలు ఖరీదు చేస్తుందన్నారు. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ ను ఈ పరికరం ఉత్పత్తి చేస్తుందన్నారు. ఐదు లీటర్ల ఆక్సిజన్ ను ఏక కాలంలో ఇద్దరికీ సరఫరా చేయవచ్చని మంత్రి వివరించారు.