Saturday, November 23, 2024
HomeTrending Newsకొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగవంతం

కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగవంతం

New Medical Colleges :

గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహా 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం పై మంగళవారం బీ అర్ కే భవన్ లో ఆరోగ్య, అర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు.

నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీల్లో మౌలిక వసతులు ఉండాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పల్లె దవాఖానల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే టర్షియరి కేర్ సేవలు అందించడం సాధ్యం అవుతుందన్నారు. సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఈ రమేష్ రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీ ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఎండి చంద్ర శేఖర్ రెడ్డి, సీ ఈ రాజేందర్, ప్రొఫెసర్ విమల థామస్, అర్ అండ్ బీ ఇ ఎన్ సి గణపతి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read :  డిసెంబరులో తెలంగాణ హెల్త్ ఫ్రోపైల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్