Monday, June 3, 2024
HomeTrending Newsబియ్యం సేకరణపై లోకసభలో...

బియ్యం సేకరణపై లోకసభలో…

Rice Procurement  :

కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణకు అనుసరిస్తున్న విధి విధానాలు ఏంటి? ఏడాదికి ఒకేసారి బియ్యం సేకరణ లక్ష్యాన్ని నిర్ణయించక పోవడానికి కారణమేంటి? రాష్ట్రాలకు గందరగోళం కలిగిస్తున్న ఈ సమస్యను అధిగమించి పంటల విధానాన్ని అనుసరించవచ్చు కదా?! కేంద్రం ఈ విషయమై తీసుకున్న చర్యలు ఏంటి? అంటూ, లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కేంద్ర ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ని ప్రశ్నించారు.

అలాగే 2021-22 (రబీ మరియు ఖరీఫ్ సీజన్లు), వివిధ రాష్ట్రాల నుండి GOI సేకరించిన వరి వివరాలు ఏమిటి? తెలంగాణ నుంచి గతేడాది రబీ సీజన్‌లో మిగిలిన 5 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించకపోవడానికి కారణాలు ఏమిటి? తెలంగాణ బియ్యం సేకరణ లక్ష్యాన్ని పెంచడానికి PIIకి లేఖ రాసిందా? ఖరీఫ్ సీజన్‌లో 4O లక్షల టన్నులకు మించి సేకరణ లక్ష్యం ఎందుకు చేయడం లేదు పంజాబ్‌లో చేసినట్లుగా తెలంగాణ నుంచి లక్ష టన్నుల బియ్యం సేకరణకు తీసుకున్న చర్యలు ఏమిటి? అంటూ ఎంపీ రంజిత్ రెడ్డి నిలదీశారు.

ఇందుకు ఆ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇస్తూ, దేశంలో 2018-19లో 1164.78 lmt కాగా, 443.99 lmt లు, 2019-20లో 1188.70 lmt కాగా, 518.26 lmt లు, 2020-21లో 1222.65 lmt కాగా, 600.74 lmt లు సేకరించామన్నారు.
తెలంగాణలో..2018-19లో 51.90 lmt లు, 2019-20లో 74.54 lmt లు, 2020-21లో 94..53 lmt లు సేకరించామని వివరించారు. రాష్ట్రం అందిస్తున్న మిగులు బియ్యం సెంట్రల్ పూల్ స్టాక్ కింద FCI ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్రాలు/యుటిల ఆహార కార్యదర్శుల సమావేశం జరిగిందని, రాష్ట్రం కోసం 40 LMT బియ్యం సేకరణ అంచనాను రూపొందించారన్నారు. బియ్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. దిగుబడుల అంచనా, మార్కెట్, డిమాండ్ ని బట్టి కనీస మద్దతు ధర ప్రకటిస్తారు. మిగతా విషయాలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, రైతుల విస్తృత ప్రయోజనాలను అనుసరించి వ్యవహరిస్తామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్