New Zealand 62 All-out :
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 62 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విని, సిరాజ్, అక్షర్ పటేల్ రాణించడంతో కేవలం 28.1 ఓవర్లపాటు మాత్రమే ఆడిన కివీస్ ఆలౌట్ అయ్యింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి తాను వేసిన రెండో ఓవర్లోనే రెండు వికెట్లు రాబట్టి సత్తా చాటాడు. తన తర్వాతి ఓవర్లో మరో కీలకమైన రాస్ టేలర్ వికెట్ పడగొట్టాడు. 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరవాత రవిచంద్రన్ అశ్విన్, అక్షర్, జయంత్ యాదవ్ లు కూడా రాణించి కివీస్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. కివీస్ ఆటగాళ్ళలో కేవలం ఇద్దరు మాత్రమే (ఓపెనర్ టామ్ లాథమ్-10; కేల్ జేమిసన్-17) రెండంకెల స్కోరు చేశారు.
తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 263 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇండియా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది, మయాంక్ అగర్వాల్ తో పాటు శుభమన్ గిల్ కు బదులు చతేశ్వర్ పుజారా ఓపెనర్ గా బరిలోకి దిగాడు. రెండోరోజు అట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. మయాంక్-38, పుజారా-29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇండియా మొత్తం 332 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
Also Read : పది వికెట్లూ అజాజ్ కే – ఇండియా 325 ఆలౌట్