Stalin – floral tributes to bipin:
నిన్న జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో దుర్మరణం పాలైన చీఫ్ అఫ్ ఆర్మీ స్టాఫ్ బిపిన్ రావత్ భౌతిక కాయానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాళులర్పించారు. కూనూరు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిన వెంటనే అమరుల భౌతిక కాయాలను వెల్లింగ్టన్ సైనిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వాటికి పరీక్షలు నిర్వహించి, మృతదేహాలను గుర్తించారు. అనతరం ప్రత్యేక శవ పేటికల్లో ఈ మృతదేహాలను ఉంచి వాటిని మద్రాస్ మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ కు తరలించారు. అక్కడ స్టాలిన్ తో పాటు పలువురు ప్రముఖులు బిపిన్, మధులిత రావత్ దంపతులతో పాటు అసువులు బాసిన మరో 9 మంది సైనిక సిబ్బందికి ఘనంగా నివాళులర్పించారు. వీరి భౌతిక కాయాలను సాయంత్రానికి దేశ రాజధాని ఢిల్లీ కి తరలిస్తారు. అక్కడ రాష్ట్రపతి, ప్రధాని తో పటు పలువురు జాతీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం వారి వారి స్వస్థలాలకు తరలించే అవకాశం ఉంది.
రావత్ దంపతుల అంత్యక్రియలు రేపు న్యూఢిల్లీ లోనే జరుగుతాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
Also Read : బిపిన్ రావత్ ఇక లేరు!