Media misleading on OTS:
ఎల్లో మీడియాను బహిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ప్రకటన చేశారు. మీడియా పేరుతో కొన్ని ప్రచార, ప్రసార సాధనాలు చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టీకం ఒక రకంగా టెర్రరిజంతో సమానమని, వీటిని ఇక భారించవద్దని, విజ్ఞులైన ప్రజలు ఇలాంటి మీడియాను బహిష్కరించాలని అయన పిలుపు ఇచ్చారు. వార్తకు ఏదైనా ఒక ఆధారం ఉంటే దానిమీద వివరణ ఇవ్వవచ్చని, కానీ అలా కాకుండా అసంబద్ధమైన, అబద్ధాలు, వితండవాదంతో కూడిన వార్తలు వస్తున్నాయని అందుకే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ తెలుగు దినపత్రికలో ఓటిఎస్ పథకంపై ‘ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడెందుకు వసూళ్లు’ అంటూ బ్యానర్ వార్త ప్రచురించారని, ఈ వార్త పూర్తి అసంబద్ధంగా ఉందని, వాస్తవం అనేది లేకుండా, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, ఆ పార్టీలో అంతర్బాగంగా ఉంటూ ఇలాంటి వార్తలు ప్రచురించారని వెల్లడించారు.
50లక్షల మంది పేదల్ని రుణ విముక్తుల్ని చేసి వారికి సొంత ఆస్తిని కల్పించడమే లక్ష్యంగా ఓటిఎస్ తీసుకు వచామని, దొంగదెబ్బ తీయాలనుకుంటే రిజిస్ట్రేషన్‌కు చార్జీలు వసూలు చేసి ఉండేవాళ్ళం కదా అని సజ్జల ప్రశ్నించారు. ఉచిత రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ప్రభుత్వానికి కనీసం రూ.6వేల కోట్లు రావాల్సింది ఆగిపోతుందని, అయినా సరే లబ్ధిదారుల మీద భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నామమాత్రంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో… రూ.10వేలు, రూ.15 వేలు, రూ.20వేలు వసూలు చేస్తుంటే ఈ పథకాన్ని వినియోగించు కోవాలని చెప్పాల్సింది పోయి అదే పనిగా విమర్శలు చేస్తున్నరై సజ్జలు మండిపడ్డారు.
చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఇవ్వని హామీ ఉండదని, అధికారంలోకి వస్తే మాత్రం ఆ హామీలను పీల్చి పిప్పి చేసి నామమాత్రంగా అమలు చేస్తారని, ఇదే కోవలో రైతులకు రుణమాఫీ అంటూ మోసం చేశారని సజ్జల గుర్తు చేశారు. అంతా ఉచితమని చంద్రబాబు హామీ ఇచ్చి రైతు రుణ మాఫీని లక్ష కోట్లు కాస్తా 14వేల కోట్లతో ముగించారని సజ్జల వెల్లడించారు.
Also Read : పేదలకు ఓ హక్కు కల్పిస్తున్నాం: సజ్జల