Voice of Ravanna:
రానా దగ్గుబాటి, సాయి పల్లవి కలిసి నటిస్తోన్నచిత్రం ‘విరాట పర్వం’. ఇదివరకు ఎన్నడూ పోషించని పాత్రల్లో ఈ సినిమాలో కనిపించబోతోన్నారు. ఇప్పటికే విడుదల చేసిన విరాట పర్వం టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన లభించింది. 1990 ప్రాంతంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా నటిస్తున్నారు. అతని కలం పేరు అరణ్య. రవన్నను ఆరాధించే అమ్మాయిగా వెన్నెల కారెక్టర్‌లో సాయి పల్లవి నటించారు. యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమ కథను ఈ విరాటపర్వం సినిమాలో చూపించబోతోన్నారు.
రానా బర్త్ డే సందర్బంగా ‘వాయిస్ ఆఫ్ రవన్న’ అంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇక ఇందులో రవన్న ఇచ్చిన ప్రసంగం అందరినీ ఉత్తేజపరిచేలా ఉంది. “మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. రౌద్రపు శత్రువు దాడిని ఎదురించే పోరాటం మనదే.. ఛలో ఛలో పరిగెత్తు.. అడుగే పిడుగై రాలేలా గుండెల దమ్ముని చూపించు.. ఛలో ఛలో పరిగెత్తు.. చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూర్పు కొండని వెలిగిద్దాం.. పొంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. ఛలో ఛలో పరిగెత్తు.. దొరొల్ల తలుపుల తాళంలా.. గఢీల ముంగట కుక్కల్లా.. ఎన్నాళ్లు ఇంకెన్నాళ్లు.. ఛలో పరిగెత్తు.. ఛలో పరిగెత్తు” అంటూ రవన్న పాత్రలో రానా చెప్పిన డైలాగ్స్ హైలెట్ అవుతున్నాయి.
ఈ వీడియోలో రానా ప్రయాణం, యుద్ధం మధ్యలో సాయి పల్లవితో ప్రేమాయణం, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సంక్రాంతికి ట్రైలర్ రాబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. డి సురేష్బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. డానీ సాంచేజ్ లొపేజ్, దివాకర్ మణి కెమెరామెన్‌లుగా పని చేశారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరీ రావ్, సాయి చంద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Also Read : డిసెంబర్ 31న విడుదలవుతున్న రానా 1945