MOU with FAO:
సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్ధలను అలవర్చుకోవడం, రాష్ట్రంలో రైతుల సామర్ధ్యాన్ని పెంచేందుకు పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ)- ఏపీ ప్రభుత్వం మధ్య టీసీపీ(టెక్నికల్ కోపరేషన్ ప్రాజెక్టు) ఒప్పందం కుదిరింది. సిఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని యునైటెడ్ నేషన్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్) ప్రతినిధుల బృందం కలుసుకుంది.
ఈ సందర్భంగా సిఎం జగన్ సమక్షంలో వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, టోమియో షిచిరి, కంట్రీ డైరెక్టర్ (ఇండియా), పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ) యునైటెడ్ నేషన్స్, ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏ కె సింగ్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
- అందరికీ ఆహార భద్రతపై అంతర్జాతీయంగా కృషి చేస్తున్న ఏఫ్‌ఏఓ
- రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే)కు సాంకేతికంగా, ఆర్ధికంగా సాయం అందించనున్న ఏఫ్‌ఏఓ, ఐసిఏఆర్
- వ్యవసాయ అనుబంధరంగాల్లో నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు శిక్షణ అందించనున్న ఎఫ్‌ఏఓ
- ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతుల్లోనూ రైతులకు శిక్షణ అందించనున్న ఎఫ్‌ఏఓ
ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులు, ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన సిఎం
- గతంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల వాడకం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారు
- రైతుల సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆర్బీకేలు వచ్చాయి
- రైతులకు మద్దతు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నాం
- ఇ– క్రాపింగ్ అమలు చేస్తున్నాం
- ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయరంగంలో పెను మార్పులు వస్తున్నాయి
రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు ప్రతీకలుగా నిలుస్తాయని, ఆర్బీకేలు వ్యవసాయరంగంలో దేశానికే రోల్‌మోడల్ గా ఉంటాయని యునైటెడ్ నేషన్స్-పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ) కంట్రీ డైరెక్టర్ (ఇండియా) టోమియో షిచిరి అన్నారు. రైతులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఇన్‌పుట్స్ అందించడంలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ లు మంచి వ్యవస్ధలుగా నిలబడతాయని ప్రశంసించారు. ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్ వ్యవస్ధ, ఆర్బీకే స్టూడియోల కార్యక్రమాలు రైతులకు ఉత్తమ ఫలితాలు అందించడంలో గొప్ప మేలు చేస్తాయని కొనియాడారు.
Also Read : వృద్ధాప్య పెన్షన్ పెంపు