ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృతంగా చర్చించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని, విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని కోరారు.
సీఎం ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఆర్బీకేల ద్వారా రైతులు ఉత్పత్తుల కొనుగోలుకు చేసేందుకు అంగీకరించారు. విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధికోసం విశాఖలో ఏర్పాటు చేయనున్న హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీ ప్రాజెక్టులో భాగస్వాములం అవుతామని వెల్లడించారు. సిఎం దార్శనికత బాగుందని, రైతుల పంటలకు మంచి ధరలు రావాలన్న దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్న బాగున్నాయని ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కొనియాడారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని సీఎం ఫ్లిప్‌కార్ట్ సీఈఓకు వివరించారు. జగన్‌ను కలిసిన వారిలో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తితోపాటు, సీసీఏఓ రజనీష్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి సోలోమన్ ఆరోకియా రాజ్ పాల్గొన్నారు.
Also Read : సీఎం జగన్‌ను కలిసిన నేవీ అధికారులు