Sunday, June 7, 2026
Homeస్పోర్ట్స్యాషెస్ రెండో టెస్ట్: ఆసీస్ ఆధిపత్యం

యాషెస్ రెండో టెస్ట్: ఆసీస్ ఆధిపత్యం

Ashes 2nd Test:
యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ లోనూ  ఆస్ట్రేలియా తమ ఆధిపత్యం కొనసాగిస్తోంది. అడిలైడ్ లో డే నైట్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో ఆసీస్ 9 వికెట్లకు 473 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఇంగ్లాండ్ మొదట్టి ఇన్నింగ్స్ లో 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నిన్న మొదటి రోజు 2 వికెట్ల నష్టానికి 221  చేసి నేడు రెండోరోజు ఆట ప్రారంభించిన ఆసీస్ లో లాబుస్ చేంజ్ సెంచరీ (105) సాధించగా, కెప్టెన్ స్మిత్ సెంచరీ కి చేరువలో 93  పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కారీ అర్ధ సెంచరీ (51); మైఖేల్ స్టార్క్-39 నాటౌట్; ఈ మ్యాచ్ తో జట్టులోకి వచ్చిన బౌలర్ నేసేర్ 35 పరుగులతో రాణించారు.

ఇంగ్లాండ్ బౌలర్ల లో బెన్ స్టోక్స్ మూడు; అండర్సన్ రెండు; బ్రాడ్, ఓక్స్, రాబిన్సన్ రూట్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్  ఏడు పరుగుల వద్ద ఓపెనర్ రోరీ బర్న్స్ (4) రూపంలో మొదటి వికెట్ కోల్పోయింది. 12 పరుగుల వద్ద మరో ఓపెనర్ హసీబ్ హమీద్ (6) కూడా ఔటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి డేవిడ్ మలాన్-1; కెప్టెన్ రూట్-5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నేసేర్, స్టార్క్ చెరో వికెట్ సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular