BJP Dual standards:
అమరావతి రాజధానిపై బిజెపి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఒకప్పుడు అధికార వికేంద్రీకరణకు మద్దతు అంటూ ప్రకటించిన బిజెపి ఇప్పుడు అమరావతే రాజధానిగా ఉండాలని చెప్పడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అమరావతిపై బిజెపి రాష్ట్ర కమిటీ, కేంద్ర ప్రభుత్వం, బిజెపి అధిష్టానం తలో రకంగా మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ రాజకీయం కారణాలతో మూడు రాజధానులను వ్యతిరేకిస్తోందని కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో సమర్ధించిన కేంద్ర పెద్దలు ఇప్పుడు మరో రకంగా మాట్లాడడం సరికాదన్నారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు.
రాష్ట్రమంతా సమగ్రాభివృద్ధి చెందాలన్నది తమ ప్రభుత్వ అభిమతమని, ఈ విషయంలో బిజెపి స్పష్టమైన వైఖరి చెప్పాలని సుచరిత డిమాండ్ చేశారు. బిజెపికి నిజంగా ఈ రాష్ట్రంపై ప్రేమ ఉంటే ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలన్నారు.
Also Read : అమరావతిని కాపాడుకుందాం: బాబు