Saturday, November 23, 2024
HomeTrending Newsపీయుష్ గోయల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం

పీయుష్ గోయల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం

తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తె…కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారని,  అలాంటివారిని “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా? ఇది తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను అవమాన పరచడమేనని హరీష్ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ  పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించు కావాలి… వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మాత్రమే వ్యవహరించారన్నారు.

ఒక రాష్ట్రానికి సంబంధించి ఆరుగురు మంత్రుల కంటే ఇంకా పెద్ద డెలిగేషన్ ఉంటుందా? రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని కలువకుండా ముందు మీ బీజేపీ నేతలను పిలిపించుకుని మాట్లాడతావా? అబద్ధాలు, అసత్య ప్రచారాలు, అభాండాలు, గోబెల్స్ ప్రచారం తో రాజకీయం చేసింది నువ్వు. మీ ప్రాధాన్యం రాజకీయం..మా ప్రాధాన్యం రైతులు. ధాన్యం కొంటారా కొనరా.. చెప్పండి అని మంత్రుల బృందం వస్తె.. కలవడానికి సమయం లేదు అంటారా. వానాకాలంలో మీరు ఇచ్చిన 40 LMT టార్గెట్ పూర్తయింది. ఇప్పటికే యాభై లక్షల మెట్రిక్ టన్నుల కొన్నాం. మరో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేలా ఉంది. రైతులు చలిలో కల్లాల దగ్గర ఉంటున్నారు. వీటిని కొంటారా కొనరా అని అడగడానికి మంత్రులు వస్తే అవమానిస్తారా.
యాసంగి లో బాయిల్డ్ రైస్ కొనమని చెప్పారు.. భవిష్యత్తులో రా రైస్ కూడా కొనం అంటే ఏం చేయాలి? మంత్రులను అవమానించే హక్కు నీకు ఎక్కడిది? తెలంగాణ ప్రజలను, రైతులను, అవమనిచడం హేయమైన చర్య. ఇంతకంటే దారుణం ఉండదన్నారు. టీఆరెఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదు. అందుకే డిల్లీ వచ్చాం. మాట తప్పింది మీరు.. మాట మార్చింది మీరు. మళ్ళీ మేము రాజకీయం చేస్తున్నాం అంటున్నారు. ఎవరు రాజకీయం చేస్తున్నారో.. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలిపే విధంగా పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతులకు క్షమాపణ చెప్పాలి.

రైతుల ఓట్లు కావాలి కానీ.. వాళ్లు పండించిన ధాన్యం వద్దా??.. బిజెపి కుటిల నీటికి ఇది నిదర్శనం. రాష్ట్ర రైతాంగాన్ని ప్రజలను అవమాన పరిచే హక్కు మీకు లేదు. దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని మేము అంటున్నాం. పంజాబ్ లో మొత్తం కొంటున్నట్లే.. మా దగ్గర కొనాలి అంటున్నాం. దానికి సమాధానం చెప్పకుండా… డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు. విద్యుత్, సాగునీరు రాష్ట్రాల బాధ్యత. మా పని మేము వంద శాతం చేస్తున్నాం. పంటల కొనుగోళ్ళు కేంద్రం పరిధిలో ఉంది. మీరు మీ బాధ్యతను విస్మరించారు. చేతకాకపోతే రాష్ట్రాలకు అధికారాలు బదిలీ చేయండి. మావల్ల కాదు అని మీరు చేతులెత్తేస్తే రైతులే గుణపాఠం చెబుతారు. మీ బాధ్యత మీరు నిర్వర్తించరు. మా మంత్రులను అవమనిస్తరు. పట్టపగలు రైతుల మీద కార్లు ఎక్కించి చంపిన కేంద్ర మంత్రి కొడుకును సిట్ నివేదిక ఇచ్చినా ఎందుకు అరెస్ట్ చేయలేదు. రైతులపై మీకున్న గౌరవం అది. ఎన్నికల్లో మీరు ఓడిపోలేదా… ఎందుకు అంత విర్ర వీగుతున్నరు. ఇటీవల ఎన్నికల్లో ఎన్ని సిట్టింగ్ స్థానాలు కోల్పోలేదు. ఎమ్మెల్సీగా రామచంద్రరావు ఓడిపోలేదా?

ఒకటి కాదు పది లేఖలు రాశాం. మేము బియ్యం ఇస్తాం మహాప్రభో తీసుకో.. హమాలీలు, టెక్నికల్ పర్సన్ ల సంఖ్యను పెంచుకో, గోదాములు లీజుకు తీసుకో అని చెప్తే పట్టించుకోలేదు. పైగా డొంకతిరుగుడు ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా దొంగే దొంగ దొంగ అన్నట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మేము నిన్ను అడుక్కోవడానికో.. బిచ్చం ఎత్తుకోవడానికో రాలేదు. మీ బాధ్యతను గుర్తు చేసేందుకు వచ్చాం. అంతమాత్రాన చిన్న చూపు చూస్తారా. మమ్మల్ని అవమానిస్తే పడతాం.. కానీ రైతులను అంటే ఎట్టిపరిస్థితిలో ఊరుకోం. దేశంలో మొదటిసారిగా బిజెపి ప్రభుత్వమే వడ్లు కొనడం లేదు. గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా ధాన్యం కొన్నది. ఇప్పుడు ఎందుకు సమస్య సృష్టిస్తున్నారు. రైతుల జీవితాలతో ఆడుకుటున్నారు. వడ్లు కొంటవా… కొనవా ఒక్క మాట చెప్పు. ముఖ్యమత్రి ఎంతో కష్టపడి రైతులను ఆదుకుంటే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆడుకుంటోంది. నోటి తో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు చేస్తోంది. బియ్యం రవాణా ఆలస్యం అవుతున్నదని నా దృష్టికి వస్తె నేను ఉమ్మడి జిల్లా మంత్రిగా గతంలో FCI జనరల్ మేనేజర్ ను ఇంటికి పిలిచాను. టిఫిన్ పెట్టి 2 గంటలు బతిమిలాడిన. కలెక్టర్లు, అధికారులు, మిల్లర్లు తమ సమస్యలు చెప్పారు. ఎలాగైనా పైవాళ్ళతో మాట్లాడి బియ్యం తరలించమని కోరాను. దానికి ఆయన రైల్వే వాళ్ళు బీహార్ కు వ్యగన్లు ఇచ్చారు గానీ తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్పారు. వెంటనే నేను cs సోమేష్ కుమార్ కు చెప్పి రైల్వే వాళ్ళ తో మాట్లాడించాను.

Also Read : ధాన్యం సేకరణలో కెసిఆర్ విఫలం

RELATED ARTICLES

Most Popular

న్యూస్