Omicron In Europe : ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్ళీ తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఓమిక్రాన్ ధాటికి బాధితులకు ఆస్పత్రులు చాలటం లేదు. బ్రిటన్ దేశానికి ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు రాకపోకలు నిలిపివేశాయి. ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ గడగడలాడిస్తోంది.
టర్కీ రోజుకు 20 వేల కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ సుమారు రెండు వందల మంది కరోనా బారిన పది మృతి ఒడిలోకి చేరుతున్నారు. చైనాకు చెందినా సినోవక్ వ్యాక్సిన్ టర్కీ లో ఇస్తున్నా మహమ్మారి విస్తరణ ఆగటం లేదు. పరిస్థితి అదుపు చేసేందుకు వారం రోజుల్లో లాక్ డౌన్ పై టర్కీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోపోతే భారీ జరిమానాలతో పాటు కటిన చర్యలు తీసుకుంటామని స్పెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. స్పెయిన్ లో రోజుకు 27 వేల కేసులు నమోదవుతున్నాయి.
మరోవైపు కెనడాలో ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. రెండు రోజులుగా రోజుకు పది వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటి రేటు 10.7 ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 20 నుంచి 40 ఏళ్ల వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. అయితే కేసులు పెరుగుతున్నా, డెత్ రేట్ తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగించే అంశం.
రష్యాలో రోజుకు 30 వేలకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో సుమారు రెండు వందల మంది ప్రతి రోజు మృత్యువాత పడుతున్నారు.
Also Read : ఓమిక్రాన్ ఓ సంకర వైరస్