Telangana Highcourt : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పండగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘‘క్రిస్మస్, సంక్రాంతి, నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. జనం గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రాల సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలి. దిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాలి’’ అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచనలు చేసింది.
తెలంగాణ లో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ రోజు 236 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 65, ఢిల్లీ లో 64 కేసులు వచ్చాయి.
Also Read : యూరోప్ లో ఓమిక్రాన్ విలయం