Saturday, November 23, 2024
Homeసినిమాకొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ దొరకలేదు : వర్మ

కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ దొరకలేదు : వర్మ

RGV in Naxalite Getup: కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో షూటింగ్ ముగింపు వేడుక జరిగింది. దీనికి కొండా మురళి, సురేఖ దంపతులు హాజరయ్యారు. ఈ పార్టీకి రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెట‌ప్‌లో వచ్చారు. అంతే కాదు… ‘కొండా’, ‘బలుపెక్కిన ధనికుడా… కాల్ మొక్కుడు లేదిక’ పాటలకు ఆయన పెర్ఫార్మన్స్ చేశారు. హీరో అదిత్ అరుణ్, ఇతర నటీనటులతో కలిసి స్టెప్పులు వేశారు.

ఈ సంద‌ర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ… సినిమా స్టార్ట్ చేసే ముందు నేను కొండా మురళి పేరు వినలేదు. ఓ ఎన్నికల సమయంలో కొండా సురేఖ పేరు విన్నాను. ఆమె ఇంటర్ వ్యూలు చూశాను. నేను రాజకీయాలు ఫాలో అవ్వను. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. నేను ముంబైలో సత్య, కంపెనీ, ఇక్కడ రక్త చరిత్ర తీసినప్పుడు గానీ తెలంగాణలో సాయుధ పోరాటం గురించి తెలియదు. ఒక వ్యక్తి చెప్పారు. అప్పుడు ఆయన గురించి రీసెర్చ్ చేశాను. ప్రతి కథకు, సినిమాకు ఓ క్యారెక్టర్ ఉంటుంది. ఉదాహరణకు… హిట్లర్ లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం, గాంధీజీ లేకపోతే భారత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు. గాంధీ ఒక వైపు, హిట్లర్ మరో వైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు.

త‌నను జైలులో చంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్క‌డ కూర్చున్నారు. కొండా ముర‌ళి ఎక్స్‌ పీరియ‌న్స్‌ లు విని నేను విప‌తీరంగా ప్ర‌భావితం అయ్యాను. నాకు హిట్లర్, ముస్సోలిని, ప్రభాకరన్ నేపథ్యాలు తెలుసు. వీళ్లందరూ నమ్మిన సిద్ధాంతాలు, విలువల కోసం పోరాడతారు. అటువంటి అంశం నాకు కొండా మురళి జీవితంలో దొరికింది. అది పట్టుకుని, ఆ తాడును పట్టుకుని తీశాను. ఈ రోజు నాకు సాయుధ పోరాటం, నక్సలైట్ల గురించి తెలుసు. కొండా మురళి, సురేఖ జీవితాలను ఎంపిక చేసుకోవడానికి కారణం… వాళ్ల నేపథ్యంలో ఈ కథ చెప్పడానికి అద్భుత అవకాశం దొరికింది.

అందుకని, సినిమాకు కొండా పేరు పెట్టాను. ప్రమాదాన్ని కొండా మురళి కోరి తెచ్చుకున్నారు. ప్రమాదం వస్తుందని భయపడలేదు. దాన్ని చూసి స్ఫూర్తి పొంది సినిమా తీశాను. కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ. కొండా మురళి శత్రువులు, కొంత మంది పోలీసులను కలిసి వాళ్లు చెప్పినది విన్న తర్వాత నాకు ఓ క్లారిటీ వచ్చింది. నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్