Boxing Day Test- Australia:
మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే ఈ ఏడాది యాషెష్ సిరీస్ ను ఆస్ట్రేలియా గెల్చుకుంది. బౌలర్ బోలాండ్ దెబ్బకు ఇంగ్లాండ్ బాట్స్ మెంట్ చేతులెత్తేశారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో ఇన్నింగ్స్, 14 పరుగులతో ఘనవిజయం సాధించిన ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్ ను 3-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 31 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి మూడోరోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ మరో 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ రూట్(28); బెన్ స్టోక్స్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొత్తం నలుగురు ఆటగాళ్ళు డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో బొలాండ్ ఆరు, మిచెల్ స్టార్క్ మూడు, గ్రీన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్ తోనే టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన స్కాట్ బోలాండ్ మొత్తం ఏడు వికెట్లు తీసుకుని సత్తా చాటి, ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
ఈ గెలుపుతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానానికి ఎగబాకింది. శ్రీలంక, పాకిస్తాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా నాలుగో స్థానంలో ఉంది.
Also Read : బాక్సింగ్ డే టెస్ట్: బౌలింగ్ లో రాణించినా….