Sunday, February 23, 2025
Homeసినిమాఅల్లు అర్జున్ ‘పుష్ప’పై క‌ర‌ణ్ జోహార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అల్లు అర్జున్ ‘పుష్ప’పై క‌ర‌ణ్ జోహార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Karan Johar on Pushpa: తెలుగు సినిమాల ఓపెనింగ్‌ కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యానించారు. అందుకు అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ నే ఉదాహరణగా చూపించారు. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ నటించిన పుష్ప చిత్రం డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. బాలీవుడ్‌లో ఈ చిత్రంతో.. బన్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది.

ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సినిమా పై, బన్నీ పై ప్రశంసలు కురిపించగా.. తాజాగా కరణ్‌ జోహార్‌ కూడా కొనియాడారు. బన్నీ స్టార్ డమ్‌తోనే హిందీ ‘పుష్ప’కి భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్ డమ్‌ రావడానికి గల కారణాన్ని కూడా కరణ్‌ వివరించారు. ఓటీటీ, ఇతర మాధ్యమాల ద్వారా తెలుగు సినిమాలు హిందీలో అనువాదమవుతున్నాయి. దీంతో ఆయా నటులకు కూడా ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కి బాలీవుడ్‌లో క్రేజ్‌ పెరిగింది. దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే, హిందీలో విడుదలైన పుష్పకి కూడా భారీ ఓపెనింగ్‌ కలెక్షన్లు వచ్చాయి. హిందీ సినిమాలు కూడా అంత కలెక్షన్స్‌ రాబట్టలేకపోయాయి అని కరణ్‌ జోహార్‌ తెలిపారు.

Also Read : సుకుమార్ కి  మెగాస్టార్ ప్రశంసలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్